‘కట్టా… మల్ల’లు ఇద్దరూ క్షేమం: ఇది మానసిక యుద్దం

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రాంచంద్రారెడ్డి అలియస్ వికల్ప్, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఇద్దరూ కూడా క్షేమంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మేరకు మావోయిస్టు దండకారణ్యం పార్టీ ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇదంతా కూడా పాలక వర్గాలు చేస్తున్న మానసిక యుద్దంలో భాగమేనని, ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని మంగ్లీ కోరారు. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రేనేత మల్ల రాజిరెడ్డి చనిపోయాడని, ఆ తరువాత కట్ట రాంచంద్రారెడ్డి మరణించాడని సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రచారం జరిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్న ముఖ్య నాయకులు అనారోగ్యంతో చనిపోయారంటూ జరిగిన ప్రచారంతో అటు వారి బంధువుల ఇండ్లలో కూడా ఆందోళన నెలకొంది. మల్ల రాజిరెడ్డి అలియాస్ మీసాల సత్తెన్న కుటుంబ సభ్యులు అయితే ఆయన మరణించాడని మానసికంగా ఫిక్స్ అయి పోయారు. మావోయిస్టు పార్టీ నుండి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో అసలేం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది. చివరకు సోమవారం మావోయిస్టు పార్టీ దండకారణ్య నార్త్ సబ్ జోనల్ బ్యూరో విడుదల చేసిన ప్రకటనతో అలాంటిదేమి లేదని తెలిపోయింది.

chattisgharDANDAKARNYAMmaoist newsMembers of the Central Committee