బాలివుడ్ నటి మాధురి ఇంట విషాదం

ప్రముఖ బాలీవుడ్​ నటి మాధురి దీక్షిత్‌​ ఇంట విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం మాధురి దీక్షిత్ తల్లి స్నేహలత దీక్షిత్ తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను మాధురి దీక్షిత్​ దంపతులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాధురి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఆమె అంత్యక్రియలను ముంబయిలోని వోర్లీలో నిర్వహించనున్నట్లు మాధురి కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తూనే స్వర్గానికి పయనమయ్యారు’ అంటూ మాధురి భావోద్వేగానికి గురయ్యారు.

గత ఏడాది తన తల్లి స్నేహలత దీక్షిత్ బర్త్ డే సందర్భంగా.. ఆమెకు విషెస్ చెబుతూ మాధురి దీక్షిత్ సోషల్ మీడియాల్లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. కూతురికి అమ్మే మంచి ఫ్రెండ్ అని అంటుంటారు. అది నిజమే కదా? మీరు నా కోసం చేసినవన్నీ, నాకు నేర్పిన విషయాలన్నీ కూడా నాకు బహుమతులే’ అంటూ మాధురి దీక్షిత్ రాసుకొచ్చారు.

bolly woodbollywoodMadhuri DixitTollywood Latest NewsTollywood News