బీజేపీ వృద్ద నేతకు అస్వస్థత… ఏయిమ్స్ లో చేరిక…

దిశ దశ, న్యూఢిల్లీ:

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు… దేశంలో బీజేపీకి బలమైన పునాది వేసిిన ముఖ్య నేత లాల్ కృష్ణ అద్వాని అనారోగ్యం పాలయ్యారు. బుధవారం రాత్రి ఆయనను న్యూ ఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరపాలన్న డిమాండ్ తో అద్వానీ దేశ వ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు. బీహార్ లో ఆయనను అరెస్ట్ చేయడంతో రథయాత్రకు బ్రేకు పడింది. కరసేవకు పిలుపునివ్వడం, బాబ్రీ మసీదు కూల్చివేయడం వంటి చర్యల్లో అద్వానీ పాత్ర కీలకంగా ఉంది. దేశంలో బీజేపీని నిర్మాణం చేయడం కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వాజపేయ్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన అద్వానీకి ఇటీవల భారత రత్న పురస్కారం అందజేశారు. 96 ఏళ్ల వయసులో ఉన్న అద్వాని త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు ఆకాంక్షించారు. 

bjp newsBJP veteran leaderLal Krishna Advani