లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్…

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో గురువారం జరగనున్న విచారణ వాయిదా కావాలని ఎమ్మెల్సీ కవిత కోరినట్టు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు తాను సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ విచారణలో ఉందని 24న హియరింగ్ ఉన్నందున తాను విచారణకు రాలేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ద్వాార కవిత ఈడీ కార్యాాలయానికి సమాచారం పంపించినట్టు తెలుస్తోంది. భరత్ ఈడీ కార్యాలయం సెక్యూరిటీకి కొన్ని డాక్యూమెంట్లు ఇవ్వగా వాటిని ఈడీ అధికారులకు పంపించారు. ఈడీ కార్యాలయం నుండి సమాధానం రావల్సి ఉంది. సోమ భరత్ ను రిసిప్షన్ కౌంటర్ లో వెయిట్ చేస్తుండగా ఆయన ద్వారా పంపిన డాక్యూమెంట్లు ఆయన ఈడీ అధికారులకు అందించనున్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం తిరస్కరించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

cm kcrED inquiryKCRLatest NewsMLC KAVITHAtelangana news