పండుగ పూట బీఆర్ఎస్ పార్టీకి ఝలక్

కాంగ్రెస్ లో చేరిన భూపాలపల్లి కౌన్సిలర్లు

దిశ దశ, భూపాలపల్లి:

అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. భూపాలపల్లిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అధికార పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కురిమిల్ల రజిత శ్రీనివాస్, చల్లూరి మమత కమలాకర్, మంజాల రవి గౌడ్, చల్ల రేణుక రాములు, తోట్ల సపంత్ తోపాటు టీబీజీకేఎస్ పార్టీ నాయకులు మండ సంపత్ గౌడ్ లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ నాయకులు చేరడం భూపాలపల్లిలో చర్చనీయాంశంగా మారింది.

Bhupalappalli BRS councilors who joined the Congress partyBHUPALPALLYLatest Newstelangana news