బ్యాంకాక్ టు చెన్నై..

బ్యాంకాక్ నుండి చెన్నైకి స్మగ్లింగ్ అవుతున్న మూగజీవాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అత్యంత అరుదుగా లభ్యం అయ్యే వన్యప్రాణులను రెండు బ్యాగుల్లో ఓ ప్రయాణీకుడు తనవెంట తీసుకొచ్చుకున్నాడు. ఈ నెల 11న చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న సదరు ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు సోదాలు చేయగా అతని బ్యాగుల్లో వన్య ప్రాణులను గుర్తించారు. మరునాడు వాటిని బ్యాంకాక్ కు తిప్పి పంపించినట్టు అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారుల దాడుల్లో కొండ చిలువలు, మర్మెసెట్స్, నక్షత్ర తాబేళ్లు, కార్న్ స్నేక్స్ ను గుర్తించారు.

BangkokChennai AirportCustoms officialsPythons