మీరే బాధ్యత ఇచ్చినా పనిచేస్తా…

నడ్డాను కలిసిన బండి సంజయ్

దిశ దశ, న్యూ ఢిల్లీ:

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సోమవారం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసారు. తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసి పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. నాయకత్వం తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తనవంతు బాధ్యతలు నెరవేరుస్తానని అన్నారు. మరో ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ అగర్వాల్ తో కలిసి 15 నిమిషాల పాటు నడ్డాతో సమావేశం అయ్యారు.

bandi sanjay kumarBJP TELANGANALatest NewsMP BANDI SANJAYtelangana news