వెంకన్న సన్నిధిలో బండి సంజయ్…

దిశ దశ, ఏపీ బ్యూరో:

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన జన్మదినం పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి బుధవారం చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జన్మదినోత్సవాన్ని శ్రీనివాసుని సన్నిధిలో చేసుకోవాలని నిర్ణయించిన సంజయ్ ఈ మేరకు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయ సాంప్రాదాయాలతో బండి సంజయ్ కి స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం సంజయ్ కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

bandi sanjay kumarBJP TELANGANAKARIMNAGAR MPttd newsUnion Minister of State for Home Affairs