జాతీయ కార్యవర్గంలోకి ‘బండి’

దిశ దశ, హైదరాబాద్:

దేశంలోని వివిధ రాష్ట్రాల అధ్యక్షులను తొలగించిన బీజేపీ జాతీయ నాయకత్వం వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తీసుకుంది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు నడ్డా నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. కొత్తగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా తీసుకున్న వారిని తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఏపీకి చెందిన సోము వీర్రాజు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సురేష్ కశ్యప్, బీహార్ కు చెందిన సంజయ్ జైశ్వాల్, పంజాబ్ కు చెందిన అశ్విని శర్మ, జార్ఖండ్ కు చెందిన ీపక్ ప్రకాష్, రాజస్థాన్ కు చెందిన సతీష్ పునియాలతో పాటు చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు విష్ణుదేవ్ సాయి, కిరోడీ లాల్ మీనాలకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు.

bandi sanjaybandi sanjay kumarbjp newsBJP TELANGANALatest Newstelangana news