జైల్లో బెయిల్ ఆర్డర్ సబ్మిట్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ ఆర్డర్ కరీంనగర్ జిల్లా జైలు అధికారులకు అప్పగించారు. ఆర్డర్ కాపీని జైలు ఆవరణలోని బెయిల్ బాక్స్ లో వేశారు. కరీంనగర్ లోక సభ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావుతో పాటు పలువురు నాయకులు బెయిల్ ఆర్డర్ ను తీసుకెళ్లారు. వరంగల్ కోర్టు గురువారం రాత్రి బండి సంజయ్ కి బెయిలు ఇస్తూ నిర్ణయం తీసుకోగా ఆర్డర్ కాపీని శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు బాక్సులో వేశారు. 9 గంటల కల్లా బండి జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

bandi sanjaybandi sanjay bailCRIME TODAYkarimnagar newsLatest Newstelangana news