అడ్వకేట్ దంపతుల హత్య కేసులో ఇద్దరికి బెయిల్

దిశ దశ, పెద్దపల్లి:

హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసులో మరో ఇద్దరికి బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు గురువారం పెద్దపల్లి కోర్టులో నిందితుల తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ష్యూరిటీస్ సబ్మిట్ చేసిన అనంతరం ఇద్దరు నిందితులు కూడా జైలు నుండి బయటకు రానున్నారు. ఏ1 కుంట శ్రీనివాస్, ఏ2 అక్కపాక కుమర్ లకు బెయిల్ మంజూరు అయింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి, మంథని రహదారిలోని కల్వచర్ల సమీపంలో కారులో ప్రయాణిస్తున్న గట్టు వామన్ రావు, పీవి నాగమణీలు హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఒక్కొక్కరికి వివిధ కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా జైలు జీవితం గడుపుతున్న మరో ఇద్దరికి కూడా బెయిలు వచ్చింది.

Bail for two more accused in High Court Advocates Vaman Rao couple's murder casecrime newsCRIME TODAYtelangana newsvamanrao murder case