ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

దిశ దశ, సిద్దిపేట:

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అపశీతి చోటు చేసుకుంది. అగంతకుడు ఒకడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం మద్యాహ్నం సమయంలో ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్న క్రమంలో అగంతకుడు ఒకరు కత్తితో దాడి చేశారు. ఆఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే కత్తితో దాడి చేసిన అగంతకున్ని చాకచక్యంగా పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అతన్ని చితకబాదారు. ఈ సమాచారం అందుకున్న మంత్రి తన్నీరు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.

Attack on MP Prabhakar Reddy with knifeBRS NEWSLatest Newssiddipetatelangana news