N-కన్వెన్షన్ అంశంపై నాగార్జున మరో ట్విట్…

దిశ దశ, హైదరాబాద్:

ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన అంశంపై సినీ హీరో అక్కినేని నాగార్జున మరో సారి స్పందించారు. ‘ఎక్స్’’ ట్విట్టర్ వేదికగా ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న వార్తల్లో కంటే, ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయన్నారు. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి అంతా కూడా పట్టాయేనని, ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని తేల్చిచెప్పారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్ట్ ప్రోహిబిషన్ యాక్ట్ 24.02.2014న ఎస్ఆర్ 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం నిర్మాణం ,చట్టబద్దతపై నిర్ణయాధికారం కోసం హై కోర్టును ఆశ్రయించామన్నారు. న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటానన్ని అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని అభ్యర్థించారు.
https://x.com/iamnagarjuna/status/1827696248196837641

akkinenihydrahydraaN conventionRanganath IPS