పోలీసుల అదుపులో కార్పోరేటర్ భర్త… అరెస్టుకు రంగం సిద్దం…

దిశ దశ, కరీంనగర్:

బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నాయకుడు కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ (రేకుర్తి) 18వ డివిజన్ కు చెందిన కార్పోరేటర్ భర్త సుదగోని కృష్ణ గౌడ్ (లడ్డు)ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విచారించిన పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనపై ఏఏ కేసులు పెట్టరోనన్నవిషయాలు తెలియాల్సి ఉంది.

విచారణ జరపాలంటూ…

కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలోని ఎస్సారెప్పీ భూములు కబ్జాకు గురయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో కృష్ణ గౌడ్ హస్తం ఉందంటూ ప్రజా వాణిలో కూడా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ గౌడ్ ఆయన భార్య మాధవి కూడా అధికారులను కలిసి విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. ఎస్సారెస్పీ భూములను కొలిచి హద్దులు నిర్ణయించాలని కూడా ఆయన అధికారులకు వినతి చేశారు. అయితే శుక్రవారం మాత్రం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

abhishek mahanty ipsBRS NEWScrimecrime newskarimnagar news
Comments (0)
Add Comment