కార్పోరేటర్ జంగిలి సాగర్ అరెస్ట్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కు చెందిన మరో కార్పోరేటర్ అరెస్ట్ అయ్యారు. భూదందాల్లో వసూళ్లకు పాల్పడడంతో కేసు నమోదు చేశారు. సీతారాంపూర్ ఏరియా కార్పోరేటర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు జంగిలి సాగర్ ను అరెస్ట్ చేశామని కరీంనగర్ పోలీసులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగిలి సాగర్ పై 447, 477, 386, 506 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం కరీంనగర్ కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కరీంనగర్ కోర్ట్. సాగర్ ను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. 

abhishek mahanty ipsbreaking newskarimnagar newsLatest Newstelangana crime news
Comments (0)
Add Comment