ఆయుధాల అప్పగింత…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునితో సహా 12 మంది కీలక నేతలు ఆయుధాలతో పాటు జన జీవనంలోకి వచ్చారు. సోమవారం ఉదయం చత్తీస్ గడ్ లోని ఖైరాగఢ్ జిల్లా బకర్ కట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంహి గ్రామంలో వీరంతా బాహ్య ప్రపంచలోకి వచ్చారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాంధార్ మాంజీ (AK47), DVCMలు చందు ఊసెండి (కార్బైన్), లలిత, జానకి (INSAS), ప్రేమ (AK47), ACMలు రాంసింగ్ దాదా, సుకేష్ పొట్టం (AK47), పార్టీ మెంబర్లు లక్ష్మీ (ఇన్సాస్), సముద్రం (SLR), కవిత, యోగితలు పోలీసుల వద్దకు చేరుకున్నారు.
కాంట్రాక్టర్ హత్య..?
ఎన్ కౌంటర్లతో పార్టీ ముఖ్య నాయకులను కోల్పోవడంతో పాటు జనజీవనంలోకి వస్తున్న మావోయిస్టుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే పార్టీ శ్రేణులు ఎదురు దాడులకు పాల్పుతుండడం సంచలనంగా మారుతోంది. పార్టీ గణనీయంగా దెబ్బ తిన్నదన్న ప్రచారం ఊపందుకున్న క్రమంలో చత్తీస్ గడ్ లో ఓ కాంట్రాక్టర్ ను మావోయిస్టులు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా పామేడ్ ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంతియాజ్ ను మావోయిస్టులు గొంతు కోసం చంపేసినట్టుగా సమాచారం.