తీరు మారలేదా..? అతని వాంఛ తీర్చాల్సిందేనా..?

దిశ దశ, భూపాలపల్లి:

చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసు అధికారే అతిక్రమణకు పాల్పడుతున్నారా..? పెద్దన్న పాత్ర పోషించాల్సిన అధికారి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ మహిళ కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారం చేసినట్టుగా ఫిర్యాదులు. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరించాడని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి మహిళా కానిస్టేబుల్ గోడును వెళ్లబోసుకోవడంతో విచారణ జరపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రి ఇద్దరు డీఎఎస్పీలు, సీఐలు ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లను వేధించినట్టు నిర్దారించినట్టుగా తెలుస్తోంది.

పోలీస్ కస్టడీలో ఎస్సై!?

ఎస్సై భవానీ సేన్ పై లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్సై సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు

bhupalapallycrimeDGP TELANGANA POLICEkaleshwaramsi bhavani sen