ధాన్యం కొనండి మహాప్రభో…


దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

ధాన్యం కొనుగోలు చేసి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. అధికార యంత్రాంగం అంతా దశాబ్ది ఉత్సవ వేడుకల్లో తలమునకలై ఉంటే అక్కడి రైతులు మాత్రం తమ గోడు వినిపించుకోవాలంటూ ఆందోళన బాట పట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కోనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని పదే పదే కోరుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని రైతాంగం అంటోంది.

cm kcrktrLatest Newsrajanna siricilla districttelangana news