బీఆర్ఎస్ నాయకుల వాహనానికి ప్రమాదం

డివైడర్ ను ఢీ కొట్టిన వాహనం… అంతా సేఫ్…

దిశ దశ, మంచిర్యాల:

మహారాష్ట్రలోని నాగపూర్ లో జరగనున్న బీఆర్ఎస్ సమావేశానికి వెల్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాహనం ప్రమాదానికి గురైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జోగు రామన్న, కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ గోడం నగేష్ లు ఉన్నారు. మార్గ మధ్యలో రోడ్డుపైకి పశువు రావడంతో దానిని తప్పించబోయిన క్రమంలో వాహనం డివైడర్ ను ఢీ కొట్టింది. పాండ్రా కొడ బోరి వద్ద జరిగిన ఈ ఘటనలో వాహనాం పాక్షికంగా దెబ్బతినగా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ అంతా కూడా క్షేమంగానే ఉన్నారు. వాహనాన్ని కంట్రోల్ చేయడంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.

మేమంతా క్షేమం: జోగు రామన్న

నాగపూర్ కు వెల్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో తమ వాహనం స్వల్పంగా దెబ్బతింది తప్ప అందులో ప్రయాణిస్తున్న తామంతా క్షేమంగానే ఉన్నామని ఎమ్మెల్యే రామన్న సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు.

BRS NEWScm kcrcrimecrime newsCRIME TODAYKCRLatest NewsMLA JOGU RAMNNAMLA KOLERU KONAPPAtelangana news