పెద్దపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ దాడుల్లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు సమాచారం. ఈ దాడుల్లో రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టార్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె భద్రయ్య నేతృత్వంలో జరుగుతున్న ఈ దాడుల్లో సీఐ ఎస్ పి రవిందర్ తో పాటు పలువురు ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడిన సబ్ రిజిస్ట్రార్, అటెండర్ లకు కెమికల్ టెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఇతరాత్ర ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు. పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.

ACB raids in the statecrime newsCRIME TODAYLatest Newstelangana news