నిజామాబాద్ లో ఏసీబీ దాడులు

అసిస్టెంట్ డైరక్టర్ పట్టివేత

దిశ దశ, నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ల్యాండ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ల్యాండ్ సర్వే వింగ్ అసిస్టెంట్ డైరక్టర్ శ్యాంసుందర్ రెడ్డి అవినీతికి పాల్పడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారులు కెమికల్ టెస్ట్ తో పాటు బాధితుడు, పంచుల వాంగ్మూలాలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.

crimecrime newsCRIME TODAYLatest NewsNIZAMABADNIZAMABAD NEWStelangana news