ఏసీబీ దాడులు: ఇండస్ట్రియల్ అధికారి ట్రాప్

దిశ దశ, భూపాలపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిశ్రమల విభాగం అధికారి శ్రీనివాస్ రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ అధికారుల బృందం గురువారం పట్టుకుంది. ములగు జిల్లా మల్లంపల్లికి చెందిన ఓ బాధితునికి ట్రాక్టర్ ఇప్పించే విషయంలో లంచం అడగగా సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం దాడులు చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పరిశ్రమల అధికారి శ్రీనివాస్ ను పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ చేపట్టిన ఏసీబీ అధికారులు, బాధితులతో పాటు ప్రత్యక్ష్య సాక్ష్యుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. పూర్తి వివారాలు తెలియరావల్సి ఉంది.

ACB raids in Bhupalapally district: Industries department official trappedBHUPALPALLYCRIME TODAYLatest Newstelangana news