దిశ దశ, ఆదిలాబాద్:
ఇంఛార్జి అధికారిగా వ్యవహరిస్తూనే చేతులు చాపడం పరిపాటిగా మారింది. ఏడేళ్లలో రెండోసారి ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది. ఆదిలాబాద్ ఇంఛార్జి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి మరోసారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ. 5వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు ACB అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం లంచం తీసుకుంటున్న ఇంఛార్జి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డిని రెడ్ హైండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
2018లో…
బోధన్ ఇంఛార్జి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గతంలో కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 2018లో నమోదు అయిన ఈ కేసుపై కోర్టులో విచారణ సాగుతోంది. అయినప్పటికీ అవినీతికి పాల్పడడం మాత్రం మానలేదు. దీంతో మరోసారి ఏసీబీ అధికారులకు శ్రీనివాస్ రెడ్డి చిక్కక తప్పలేదు.
అలా ఎలా?
సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గతంలో ఇంఛార్జి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అయినప్పటికీ తిరిగి విధుల్లో చేరిన ఆయనకు మళ్ళీ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించడం గమనార్హం.