యువతిపై కత్తితో దాడి ఆసుపత్రికి తరలింపు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది, నగర శివార్లలోని కొత్తపల్లిలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు… 24 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేసిన యువకుడు గురువారం రాత్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితురాలి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక మీనాక్షి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

breaking newscrime newsCRIME TODAYkarimnagar newstelangana crime news
Comments (0)
Add Comment