అక్టోబర్ 3న ఈసీఐ అధికారుల రాక

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాలపై భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఓటరు నమోదుతో పాటు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను చక్కదిద్దే పనిలో ఈసీఐ అధికారులు నిమగ్నమైన సంగతి తెలిసిందే. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నాతాధికారుల బృందం కూడా తెలంగాణలో పర్యటించనుంది. అక్టోబర్ 3న రానున్న ఈ హైలెవల్ టీమ్ మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే పర్యటించనుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమీక్ష నిర్వహించడంతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలను, రాష్ట్రంలోని ముఖ్య అధికారులతోనూ కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈసీఐ స్టేట్ సీఈఓ వికాస్ రాజ్ కూడా ప్రకటించారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు చక్కబెట్టేందుకు ఎన్నికల కమిషన్ స్పెషల్ నజర్ వేసినట్టుగా స్పష్టం అవుతోంది.

2023 electionsA team of EC officials to Telangana on October 3ECILatest Newstelangana news