భార్య బాధకు ఇళ్లు తగులబెట్టుకున్న ఘనుడు

దిశ దశ, పెద్దపల్లి:

అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టుంది ఈ ప్రబుద్దుడి వ్యవహారం. భార్య మీద కోపంతో ఏకంగా ఇంటికే నిప్పంటించాడో వ్యక్తి. అత్యంత విచిత్రంగా జరిగిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో జరిగింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఎన్టీపీసీ క్రషర్ నగర్ లో రవి, రహీమాలు ఆదర్శ వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా రహీమాకు చెందిన ఇంట్లోనే వీరిద్దరూ కాపురం చేస్తున్నారు. ఇటీవల కాలంలో భార్యా భర్తల మధ్య తరుచూ జరుగుతున్న గొడవలు పొలీస్ స్టేషన్ కు కూడ చేరాయి. రవి గొడవ తీవ్రతరం కావడంతో రహీమా గోదావరిఖని లక్ష్మినగర్ లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. భార్య ఇంటికి రాకుండా పుట్టినింటికి వెల్లిందన్న కోపంతో బుధవారం అర్థరాత్రి ఇంట్లోని ప్రిజ్, డ్రెస్సింగ్ టేబుళ్లను బయట పడేసి ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఇంటిలోపల పెట్రోల్ చల్లి నిప్పంటించి పరారయ్యాడు. ఒక్క సారిగా ఇంట్లో మంటలు చెలరేగడంతో సమీపంలో నివసిస్తున్న వారంతా మంటలు చల్లార్చారు. ఈ ఘటనలో రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనపై రహీమా పిర్యాదు చేయడంతో ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిప్పంటుకోవడంతో దగ్దమైన సామాగ్రి
crimecrime newsCRIME TODAYLatest NewsPEDDAPALLY DISTRICTramagundamtelangana news