స్మోక్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన లైగర్ బ్యూటీ?

అందానికి పెట్టింది పేరుగా నిలిచే అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్‌లో తన నటనతో ఎందరో అభిమానులను కూడగట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అన‌న్య పాండే.. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2 మూవీతో కెరీర్ ప్రారంభించింది.ఇక బాలీవుడ్‌లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ అమ్మడకు అంతగా అవకావశాలు రావడం లేదు.

ఇక టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోవాలని ఈ అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ పాపం, చివరకు ఆమె ఆశలు అడియాశలయ్యాయని చెప్పవచ్చు. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతే కాకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ అమ్మడు పేరు ఎక్కడా వినిపించడం లేదు.

తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ, అనన్య పాండే పెళ్లి వేడుకల్లో దర్శనం ఇచ్చింది. తన కజిన్ అలన్నా పాండే వివాహ వేడుకల్లో అందరూ సంబరాల్లో మునిగిపోతే, ఈ అమ్మడు మాత్రం ఓ సైడ్‌కు నిల్చుని స్మోక్ చేస్తూ తన అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో వామ్మో అనన్య పాండే స్మోక్ చేస్తుందా అని కొందరు అంటే, నువ్వు స్మోక్ చేస్తావా.. సిగ్గుందా..? అంటూ మరికొందరు ఆమెను ఏకేస్తున్నారు.

A liger beautyANANYA PANDETollywood Latest NewsTollywood News