కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం…

దిశ దశ, చెన్నూరు:

మంచిర్యాల జిల్లాలోని ఓ కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేటలోని ఆదిశంకరాచార్య కాటన్ మిల్లులో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా మిల్లు నిర్వాహకులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పత్తి రాశులకు అంటుకున్న మంటలను గమనిస్తే మాత్రం పెద్ద ఎత్తున నష్టం సంభవించినట్టుగా స్పష్టం అవుతోంది. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

CHENNUR NEWSCOTTONCRIME TODAYfire accidenttelangana crime news
Comments (0)
Add Comment