సంతోష్ రావుపై కుట్ర కేసు…


దిశ దశ, హైధరాబాద్:

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఎన్ఈసీఎల్ కంపెనీకి చెందిన భూమిని సంతోష్ రావు ఆక్రమించుకున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ డాక్యూమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నంబర్లు సృష్టించి భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ భూమిలో అక్రమంగా చొరబడి గదులు నిర్మించుకున్నారని ఈ వ్యవహారంలో సంతోష్ కుమార్, లింగారెడ్డి, శ్రీధర్ లపై చింత మాధవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీరిపై ఐపీసీ 420, 468, 471, 447, 120 r/w 34 సెక్షన్లలో కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

BRS NEWSLatest NewsMP Joginapally Santosh Raotelangana news