మేమూ మైనార్టీలమే…

మాకూ ఆర్థిక సాయం అందించాలి

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో అధికార పార్టీ కార్పోరేటర్ దంపతులు మరోసారి తమ నిరసన ప్రదర్శన చేపట్టారు. మైనార్టీ కార్పోరేషన్ లో తమకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. శనివారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జలీల్ వాహనం ముందు బైఠాయించడం సంచలనం కల్గించింది. కరీంనగర్ కార్పోరేటర్ కమల్ జిత్ కౌర్, ఆమె భర్త బీఆర్ఎస్ నాయకుడు సోహన్ సింగ్ లతో పాటు పలువురు సిక్కులు స్థానిక సర్క్యూట్ గెస్ట్ హౌజ్ లో నిరసన వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో రక్షణ చర్యల్లో పాల్గొంటూ దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సిక్కు సమాజాన్ని మైనార్టీ విభాగం వివక్షకు గురి చేస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. మైనార్టీ విభాగం ద్వారా సిక్కులకు రుణాలు అందడం లేదని, ఈ విభాగంలో ముస్లింలతో సమానంగా సిక్కులు, క్రైస్తవులను కూడా పరిగణించాలని కమల్ జిత్ కౌర్ డిమాండ్ చేశారు. మైనార్టీకి చెందిన అన్ని వర్గాల వారిని ఆదరించాలని వారు వినతి చేశారు.

karimnagar newsLatest Newstelangana news