ఒక్క నిమిషం ఆలస్యం… ఎంత పనిచేసిందో…

దిశ దశ, పెద్దపల్లి:

ఒకే ఒక్క నిమిషం ఆ అభ్యర్థిని పోటీ నుండి దూరం చేసింది. ఆ ఒక్క నిమిషమే కలిసొస్తే ఓటర్లను అభ్యర్థించాల్సిన ఆయన నోడల్ ఆఫీసర్ కాళ్లు మొక్కాల్సి వచ్చింది. పెద్దపల్లి లోకసభ స్థానానికి దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య నామినేషన్ వేసేందుకు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆయన కార్యాలయానికి చేరుకునే సరికి నామినేషన్ సమయం ముగిసింది. నామినేషన్ల చివరి రోజు కావడంతో మరో రోజున నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మాతంగి హనుమయ్య పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. కార్యాలయం మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాళ్లుమొక్కినా కూడా ఆయన నిభందనలు వర్తించవని తేల్చి చెప్పారు. దీంతో హనుమయ్య నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

2024 Electionslok sabha electionsmp electionsPeddapallitelangana news