పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

దిశ దశ, రంగారెడ్డి:

పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించింది ఎల్ బి నగర్ కోర్టు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం లోయపల్లికి చెందిన ఓ మైనర్ పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నంబర్ 113/2016లో సెక్షన్ 376, 362, 493, 496 ఐపీసీ, సెక్షన్ 3,6 RW 5(k) ఆఫ్ పోక్సో యాక్ట్ లలో కేసు నమోదయిన ఈ కేసులో బూడిద బాల నర్సింహ (43) నిందితునిగా చేర్చారు. ఈ కేసుపై విచారించిన ఎల్ బి నగర్ కోర్ట్ సోమవారం తీర్పునిచ్చింది. నిందితుడు బాల నర్సింహకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో వెలువరించింది.

crimejudgementRANGAREDDYtelangana newstelangana police