కార్పోరేటర్ భర్త మార్షల్ అరెస్ట్: 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్పోరేటర్ భర్త మెండు చంద్ర శేఖర్ (మార్షల్)ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్ బల్దియాలో అధికారులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. టీపీఓ తేజస్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్షల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆయనపై సెక్షన్ 307, 333, 292, 74, 132, 352, 351 (2) బీఎన్ఎస్ యాక్టు 2023లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. చంద్ర శేఖర్ కు 14  రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కరీంనగర్ కోర్ట్. 

crime newskarimnagarkarimnagar newstelangana news