13 గంటల ఉత్కంఠకు తెర

ఎట్టకేలకు ఎలుగుబంటి పట్టివేత

దిశ దశ, కరీంనగర్:

శుక్రవారం రాత్రి 11 గంటల నుండి శనివారం మద్యాహ్నం 12 గంటల వరకు కరీంనగర్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. శనివారం రేకుర్తిలో సంచరిస్తున్న ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎనిమల్ రెస్క్యూ వ్యాన్ తో వచ్చిన టీమ్ దానిని పట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. చివరకు రేకుర్తి పాత గ్రామ పంచాయితీ గుట్ట పొదల్లోకి చేరిన ఎలుగుబంటికి రెస్క్యూ టీం గన్ సాయంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపటి తరువాత ఎలుగుబంటి మత్తులోకి చేరుకున్నదని నిర్థారించుకున్న తరువాతత రెస్క్యూ టీం దానికి బటకు తీసుకొచ్చి వ్యాన్ లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. రెస్క్యూ టీం చేరుకోనట్టయితే ఎలుగుబంటి హంగామాతో స్థానికులు భయం గుప్పిటనే కాలం వెల్లదీయాల్సి వచ్చది.

13 Hours of Suspense: A Bear Trapped in RaykurtiBEAR IN KARIMNAGARBear migration on the outskirts of Karimnagarkarimnagar newsLatest Newstelangana news