అందరి దృష్టి అటే.. ఓట్లు మాత్రం ఎటో…

మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, టీఆరెఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు జనాన్ని ఆకట్టుకోవడం ఎలా అని భారీ స్కెచ్ లు వేస్తుంటే ఆ అభ్యర్థికి మాత్రం ఫుల్ క్రేజీ కనిపిస్తోందట అక్కడ. క్యాడర్, లీడర్ లేకున్నా ఆయన్ని చూసేందుకు అక్కడి జనం ఆసక్తి చూపుతున్నారట. ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తున్న స్టైల్… మాట్లాడుతున్న తీరు చూసేందుకు జనం ఆసక్తిగా తిలకిస్తుండడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..?

పాల్… మ్యాజిక్

ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ గురించి తెలియని వారు ఉండరేమో. ప్రపంచమంతా తిరుగుతుండే పాల్ గురించి తెలుగు ప్రజలకు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనుగోడు ప్రజలను మాత్రం ఇట్టే ఆకర్షిస్తున్నారని, ఆయన వ్యవహరిస్తున్న తీరు గురించే చర్చింకుంటున్నారట. ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తే తాను అన్నింటా అభివృ‌ద్ది చేస్తానని చెప్తున్న పాల్ ప్రచారంలోనూ వైవిద్యత కనబరుస్తున్నారు. ఎప్పుడూ సూటు బూటులో కనిపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే పాల్ మునుగోడులో ఓటర్లను అభ్యర్థిస్తున్న తీరు మాత్రం విచిత్రంగానే ఉంది. ధోతి కట్టి బనియన్ వేసుకుని తలకు రుమాలు చుట్టుకుని ప్రచారం చేయడం, తనకు ఉంగరం గుర్తు వచ్చిందని ఉంగరాలు కొనుగోలు చేయడం, చేలల్లోకి వెల్లి ప్రసంగించడం, సైకిల్ తొక్కుతూ ముందుకు సాగడం ఇలా డిఫరెంట్ గా పాల్ తన మార్క్ ప్రచారం చేస్తున్నారు. రోడ్డు షోలను మరిపిస్తూ కూడళ్లలో జనంతో కలిసి ఓటు వేయాలంటూ అడుగుతున్న తీరును చూసిన మునుగోడు ఓటర్లు నవ్వుకుంటూ చూస్తున్నారు. ఇతర పార్టీల కంటే పాల్ చేస్తున్న ప్రచారం, వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న శైలిని గమనిస్తున్న మునుగోడు ప్రజలు కొంత ఆసక్తిని అయితే కనబరుస్తున్నారు.

ఓట్లు ఎటో మరీ..?

కేఎ పాల్ చేస్తున్న ప్రచారం ఇక్కడి ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ ఓట్లు ఎటు వేస్తారోనన్న చర్చే ఎక్కువగా సాగుతోంది. వైవిద్యంగా పాల్ చేస్తున్న ప్రచారం గురించి మునుగోడు వాసులు చర్చించుకుంటున్నప్పటికీ ఈవీఎంల వద్దకు వెల్లాక ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి మరి..

ap newscm kcrK. A. Paulka paulka paul at munugoduLatest NewsMunugode Assembly constituencyMunugode Bypollmunugoduprajashanthi partyTelangana Bypolltelangana newstrs party