మంచిర్యాలలో ఎస్సై హల్ చల్

బ్లూ కోట్ టీంతో గొడవ

సిద్దిపేట జిల్లాలో పని చేస్తున్న ఓ ఎస్ ఐ మంచిర్యాలలో హల్ చల్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బ్లూ కోట్ సిబ్బందితో గొడవ పడినట్టు ఉన్న వీడియోలు కూడా ట్రోల్ అవుతుండడంతో పోలీసు విభాగంలో చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్సైగా పని చేస్తున్న తిరుపతి తన సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లికి వెల్లారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి హంగామా చేస్తున్న క్రమంలో స్థానికులు 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి మంచిర్యాల బ్లూకోట్ పోలీసులు చేరుకోగా వారితో తిరుపతి అతని స్నేహితులు వారితో గొడవ పడ్డారు. ఈ గొడవ చూసిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కారును వదిలేసి ఎస్సై తిరుపతి సహా అతని స్నేహితులు అక్కడి నుండి పరార్ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

crimekarimnagarkarimnagar cpmanchirial newspolice crimeramagundam cpramagundam policesi halchalsiddipetsiddipet cptelangana crimetelangana police