ఉప ఎన్నికల కవరేజీలో ఆగిన కలం…

మునుగోడు ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ నందగిరి గుండెపోటుతో మరణించడం విషాదాన్ని నింపిది. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కు చెందిన ఆయన పలు తెలుగు టీవీ ఛానెల్లలో జర్నలిస్టుగా సేవలందించారు. సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఆయన ఉప ఎన్నికల కవరేజీ కోసం మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో శ్రీధర్ తీవ్రమైన గుండె నొప్పితో బాధపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన సహచర జర్నలిస్టు మిత్రులు చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. హోరాహోరీగా సాగుతున్న ఉప ఎన్నికల కవరేజీకి వెల్లిన శ్రీదర్ హఠన్మారణం యావత్ జర్నలిస్టు లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. త్వరలో ఓ సర్వే ఏజెన్సీలో పని చేసేందుకు ఒప్పందం కూడా చేసుకున్నాడని, నవంబర్ మొదటి వారంలో సదరు సంస్థలో చేరాల్సి ఉన్న క్రమంలో ఈ ఘోరం జరగిపోయింది.

bandi sanjaycm kcretvetv bharathijujournalistjournalist deathKCRKomatireddy Rajagopal ReddyKusukuntla Prabhakar ReddyMunugode Bypollmunugodumunugodu by pollmunugodu newstrs mlatrs partytuwj