Telangana to Maharashtra: పానశాల… పాకశాల… వైద్యశాల..!

పోడ్సా క్లబ్ లో సకల సౌకర్యాలు…

వాట్సప్ స్టేటస్ ద్వారా ప్రచారం…

దిశ దశ, జాతీయం:

మద్యాహ్నం 2 గంటలకు చేరుకునే పేకాట ప్రియులకు అక్కడ సకల సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. క్లబ్ వద్దకు చేరుకోగానే నాన్ వెజిటేరియన్ భోజనం, ఆట ఆడుతున్నంత సేపూ టీ, టిఫిన్, స్నాక్స్ అన్ని కూడా ఉచితంగానే సమకూర్చుతున్నారు. షుగర్ పేషంట్లు అయితే పుల్కాలు, సాధారణ ఆటగాళ్లయితే భోజన వసతి ఇలా ఒక్కటేమిటీ అన్ని విధాలుగా అరెంజ్ మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు పోడ్సా క్లబ్ నిర్వాహకులు. అస్వస్థకు గురైన వారికి అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉంచడమే కాదు… అన్ని రకాల బ్రాండ్ల మద్యం కూడా అక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. లిక్కర్, సిగరెట్స్, గుట్కా వంటి వాటికి మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, ఫుడ్, మెడిసిన్స్ అన్ని కూడా ఉచితంగానే అరేంజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన క్లబ్ నిర్వాహకులు ఏ స్థాయిలో ఆదాయం గడిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

సీసీ కెమెరాలు…

పోడ్సాలో ఏర్పాటు చేసిన క్లబ్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతున్నట్టుగా సమాచారం. ఈ క్లబ్ లో జూదం ఆడుతున్నప్పుడు తప్పిదాలు చోటు చేసుకున్నట్టయితే గొడవలకు తావు లేకుండా సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిర్దారించుకుంటున్నారు. చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నప్పటికీ పేకాట రాయుళ్లకు పారదర్శకమైన సేవలు అందిస్తున్నారంటే నిర్వాహకుల దర్జాతనం ఏపాటిదో గమనించవచ్చు. రోజూ మద్యాహ్నం మూడు గంటల నుండి తెల్ల వారు జామున 3 గంటల వరకు కూడా పోడ్సా క్లబ్ లో పేకాట నిర్విరామంగా సాగుతోందని తెలుస్తోంది.

ఫంటర్స్ కోసం…

ఇకపోతే ఫంటర్స్ కోసం ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుని మరీ ఫంటర్లకు ఎర వేస్తున్నారు. కరీంనగర్ నుండి కూడా ప్రత్యేకంగా జూదగాళ్లు పోడ్సాకు వెలుతున్నారంటే నిర్వాహకులు నెట్ వర్క్ ఎలా ఉందో గమనించవచ్చు. ‘‘TODAY CLUB RUNNING’’, ‘‘PODSA SUCCESS FULLY RUNNING’’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు కొంతమంది. వాట్సప్ స్టేటస్ లో పోడ్సా క్లబ్ గురించి ప్రచారం చేస్తున్న వారు దర్జాగా తమ కాంటాక్ట్ నంబర్ కూడా షేర్ చేస్తుండడం గమనార్హం. పోడ్సా క్లబ్ కు ఫంటర్లను సమీకరించుకునేందుకు కొన్ని ప్రాంతాల వారు వాట్సప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు వెళ్లాలి..? ఏంత మంది వెళ్లాలి, ప్రయాణించేందుకు అవసరమైన వాహనాల సమీకరణ తదితర వ్యవహారాలను చక్కబెట్టేందుకు తెలంగాణాలోని పేకాట ప్రియులు సోషల్ మీడియా వేదికగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

పారిశ్రామిక ప్రాంతంపై…

పోడ్సా క్లబ్ లో జూదం నిర్వహిస్తుండడం వల్ల పారిశ్రామిక ప్రాంతంపై తీవ్రంగా పడుతోంది. మంచిర్యాల, పెద్దపల్లిలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున పోడ్సా క్లబ్ కు వెల్లి పేకాట ఆడుతున్నట్టుగా సమాచారం. రిటైర్ అయిన వారితో పాటు నేటి తరం యువత కూడా జూదం కేంద్రానికి తరలివెలుతున్నట్టుగా తెలుస్తోంది. మద్యాహ్నం 12 గంటల నుండి పోడ్సాకు వెల్లేందుకు ఆయా ప్రాంతాల్లో ఎంచుకున్న అడ్డాలకు కార్లు వచ్చి చేరుతుంటాయని సమాచారం.