Acb Trap: తహసీల్దార్ లను మేనేజ్ చేస్తున్న డాక్యూమెంట్ రైటర్లు….

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో ఏసీీబీ అధికారులు ఇంఛార్జి తహసీల్దార్ ను పట్టుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ ద్వారా డీల్ కుదుర్చుకున్న తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… జిల్లాలోని రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఇంఛార్జి తహసీల్దార్ గణేష్ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్ ముజాఫర్ డీల్ కుదిర్చి రూ. 10 వేలకు ఒప్పించాడు. మంగళవారం సాయంత్రం రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంచార్జి తహసీల్దార్, గణేష్, ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్ ముజాఫర్ లను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు