సర్వేయర్ ఏసీబీ ట్రాప్…
దిశ దశ, నిర్మల్:
వ్యవసాయ భూమి హద్దులను నిర్దారించేందుకు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. బాధితుని నుండి ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం అవినీతికి పాల్పడిన సర్వేయర్ ను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. బాధిత రైతుకు సంబంధించిన భూమి హద్దులు నిర్దారించేందుకు నిర్మల్ రూరల్ సర్వేయర్ బాలకృష్ణ రూ. 12500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు మొదట రూ. 5 వేలు చెల్లించగా, మంగళవారం రూ. 7,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ పరీక్షలు నిర్వహించిన అధికారులు వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు.

