దిశ దశ, కరీంనగర్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వాలని ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పటికే పలు రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న కౌశిక్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యల ఫలితంతో మరో కేసు నమోదు అయింది. కరీంనగర్ వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ లోని ఓ హోటల్ లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ లో పోలీసులు నమోదు చేస్తున్న కేసులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులకు అయినా మిత్తితో సహా చెల్లిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయా వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయంపై కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, అశీష్ గౌడ్ లు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడరని, అయనపై కేసు నమోదు చేయాలని వారు ఆ పిటిషన్ లో కోరారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
dishadasha
2175 posts
Prev Post
Next Post

